ముచ్చటగా మూడో పెళ్లి, కానిస్టేబుల్‌ అరెస్టు

CRPF Constable Third Marriage Arrested In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కట్టుకున్న భార్యను మానసిక, శారీరక వేధింపులకు గురిచేసి గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్న సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సహరా ఎస్టేట్‌లోని గందార అపార్టుమెంటులో నివాసం ఉంటూ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎడ్ల శంకరయ్య (39) 2011లో ఒక మహిళను పెళ్లి చేసుకుని వదిలేశాడు. అనంతరం 2016లో మరో మహిళ శారద (38)ని పెళ్లి చేసుకున్నాడు.

2017లో వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే, శంకరయ్య బదిలీ కావడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్న మంజుల రాణి అనే మహిళను శంకరయ్య 2019 నవంబర్‌ 30న తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న శారద వనస్థిలిపురం పోలీసులను ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు శంకరయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
(చదవండి: ప్రియుడితో క‌లిసి భ‌ర్తను హ‌త్య ‌చేసిన భార్య‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top