మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ నదీమ్‌ అరెస్ట్‌

Criminal Held After Brief Encounter With Delhi Police In Gazipur - Sakshi

ఢిల్లీ:  ఘాజిపూర్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ నదీమ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డిప్యూటి కమిషనర్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గాజిపూర్‌ ముర్గా సమీపంలో నదీమ్‌ను అదుపులోకి తీసుకుంది. అయితే పోలీసులను చూసి నదీమ్‌ కాల్పులకు తెగబడటంతో ఇరువర్గాల మధ్య కాల్పుల కలకలం రేగింది. ఈ ఏడాది జులైలో సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పై కూడా ఆయన కాల్పులు జరిపి నదీమ్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు కూడా హత్యాయత్నం సహా పలు క్రిమినల్‌ కేసుల్లో నదీమ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top