కన్నింగ్‌ కపుల్‌: పూజారులే టార్గెట్‌ | Couple Arrested Over Cheating Priests In Lucknow | Sakshi
Sakshi News home page

కన్నింగ్‌ కపుల్‌: పూజారులే టార్గెట్‌

Aug 29 2020 3:35 PM | Updated on Aug 29 2020 3:45 PM

Couple Arrested Over Cheating Priests In Lucknow - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దిలీప్‌ కుమార్‌ పతాక్‌ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

లక్నో : పూజల పేరిట పూజారులను మోసం చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌, సీతాపూర్‌కు చెందిన గీతా పతాక్‌, గులాసి రామ్‌ పతాక్‌ దంపతులు ఈ నెల 27న మారథాన్‌ పూజ నిర్వహించటానికి 60మంది పూజారులను పిలిపించారు. వారు 14 రోజుల పాటు గీతకు చెందిన ఆశ్రమంలో, ఇంట్లో పూజలు నిర్వహించారు. పూజ అయిపోయిన తర్వాత పూజారులకు ఓ బ్యాగ్‌ ఇచ్చి అందులో డబ్బులు ఉన్నాయని, తర్వాత తెరవమని చెప్పింది గీత. కొద్ది సేపటి తర్వాత పూజారులు బ్యాగ్‌ తెరిచి చూడగా అందులో దూది, దొంగ నోట్లు కనిపించాయి. (నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో )

దీంతో దిలీప్‌ కుమార్‌ పతాక్‌ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు గతంలో కూడా పలువురు పూజారులను పూజల పేరిట మోసం చేసినట్లు తేలింది.  హోమాలు, యజ్ఞాల పేరిట గ్రామస్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, పూజలు నిర్వహించిన పూజారులను దొంగ నోట్లతో మోసం చేస్తూవస్తున్నారని వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement