British Woman Raped At Goa Beach In Front Of Husband - Sakshi
Sakshi News home page

మసాజ్‌ పేరుతో దారుణం.. భర్త ఎదుటే భార్యపై లైంగిక దాడి..

Jun 7 2022 11:37 AM | Updated on Jun 7 2022 12:43 PM

British Woman Raped At Goa Beach In Front Of Husband - Sakshi

దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులుపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు భారత్‌ పరువును తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులపై లైంగిక దాడులకు పాల్పడుతూ.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు. 

తాజాగా గోవా ట్రిప్‌ కోసం వచ్చిన ఓ బ్రిటిష్‌ జంటకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల ప్రకారం.. గోవాలోని అరాంబోల్ బీచ్‌కు బ్రిటన్‌కు చెందిన కపుల్స్‌ వచ్చారు. ఈ క్రమంలో వారికి టూరిస్ట్‌ గైడ్‌గా విన్సెంట్‌ డిసౌజా పరిచయం చేసుకుని బీచ్‌లు తిప్పాడు. అనంతరం.. అంతర్జాతీయ పర్యాటకులతో బాగా ప్రాచుర్యం పొందిన ఉత్తర గోవా జిల్లాలోని అరాంబోల్ బీచ్ సమీపంలో మసాజ్‌ చేపిస్తానంటూ వారిని అక్కడికి తీసుకెళ్లాడు. 

మసాజ్‌ చేస్తున్న క్రమంలో డిసౌజా.. భర్త కళ్ల ముందే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూన్‌ 2వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ దారుణ ఘటన అనంతరం బాధితులు.. బ్రిటన్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను సంప్రదించి.. భారత్‌లోని బ్రిటిష్‌ రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరిన తర్వాత బాధితులురాలు పెర్నెమ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. కాగా. నిందితుడు గతంలో ఓ పాఠశాలలో లైబ్రేరియన్‌గా కూడా పనిచేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం రష్యా దేశానికి చెందిన యువతిపై ఓ భారతీయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో రమ్మీకి బానిసై.. ఇంట్లో భర్త లేనప్పుడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement