ఖాతా ఉంటేనే తల్లికి వందనం | - | Sakshi
Sakshi News home page

ఖాతా ఉంటేనే తల్లికి వందనం

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

చిత్తూరు కలెక్టరేట్‌: 2026–27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం పొందే ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు కచ్చి తంగా బ్యాంక్‌ లేదా పోస్టల్‌ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం జూన్‌లో తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీలోగా ఖాతా ప్రారంభించి ఎన్‌పీసీఐ లింకు పూర్తి చేసుకోవాలని తెలిపా రు. కళాశాల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగా హన కల్పించాలని పేర్కొన్నారు.

జిల్లా ఫుట్‌బాల్‌

బాలుర జట్ల ఎంపిక

పలమనేరు: పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం చిత్తూరు జిల్లా ఫూట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సీనియర్‌, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్లను ఎంపిక చేశా రు. జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు హాజరుకాగా 65 మందిని ఎంపిక చేసినట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హేమంత్‌రెడ్డి తెలిపారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆపై పోటీలకు సిద్ధం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి విక్రమ్‌రాజ్‌, ఉపాధ్యక్షుడు కిశోర్‌, కోశాధికారి సుబ్రమణ్యం నాయుడు, నవీన్‌కుమార్‌, కిరణ్‌, రాకేష్‌, హరీష్‌ పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో

టెన్త్‌ మార్కుల జాబితాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా పదో తర గతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల జాబితాలు www. bre.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. హెచ్‌ఎంలు విద్యా ర్థుల మార్కుల జాబితాలను డౌన్‌లోడ్‌ చేసి అందజేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థి వివరాల్లో అవసరమైన సవ రణలు చేసేందుకు వెబ్‌సైట్‌లో ఈ నెల 29 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటుందని పేర్కొన్నారు.

నేడు డీఎస్సీ అక్రమాలపై ధర్నా

తిరుపతి మంగళం : డీఎస్సీ–2025 అక్రమాలపై శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు రావాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని ఆహ్వానించా రు. ఈ మేరకు గురువారం చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నారా లోకేష్‌ విద్యాశాఖా మంత్రిగా ఉండి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement