నాయీబ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్‌ | - | Sakshi
Sakshi News home page

నాయీబ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్‌

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

చిత్తూరు అర్బన్‌: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ నాయీబ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షుడిగా టి.వెంకటేష్‌ను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు నగరరంలోని పాత మార్కెట్‌కు చెందిన వెంకటేష్‌ను నాయీబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా నియమించాలన్న నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రతిపాదనపై జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పార్టీ హైకమాండ్‌కు రెకమెండ్‌ చేశారు.

పరికరాలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో యంత్ర పరికరాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి గురువారం తెలిపారు. కొన్ని రోజులుగా రాయితీతో యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు స్వీకరించామన్నారు. ట్రాక్టర్ల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయన్నారు. 2 వేల వరకు రాగా పలు దరఖాస్తులు అనర్హులవిగా తేల్చామన్నారు. 1,544 దరఖాస్తులు యంత్ర పరికరాలను అర్హమైనవిగా నిర్ధారించమన్నారు. త్వరలో లక్కీడిప్‌ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement