కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని మంగళవారం రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ సినీ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కూడా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
కడుపు నొప్పి తాళలేక..
పెనుమూరు(కార్వేటినగరం): కడుపునొప్పి తాళలేక ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుమూరు మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం.. మండల పరిధిలోని చిప్పారపల్లి పంచాయతీ, గాంఽధీపురం గ్రామానికి చెందిన చెంగల్రాయులు భార్య మణెమ్మ(62) కొన్నాళ్లుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి భరించలేని కడునొప్పితో బాధుపడుతోంది. ఆమె భర్త, కుమారుడు మతిస్థిమిత్తం లేకుండా ఉండడంతో ఆమె ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోయింది. సోమవారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ తెలిపారు.
కడా పీడీ ఆకస్మిక తనిఖీ
కుప్పం: కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కుప్పం కడా పీడీ వికాస్ మర్మత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం కుప్పం బస్డాండు ప్రాగణంలో ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. అలాగే మండల పరిధిలోని పరమసముద్రం వద్ద నిర్మిస్తున్న హలీఫ్ పరిశ్రమ పనులను, ఆ తర్వాత గుడుపల్లె మండలం, కంచిబందార్లపల్లి గ్రామంలో జరుగుతున్న మురుగునీటి కాలువ పనులను పరిశీలించారు.


