ప్రియుడి మోజులో పడి.. ఇద్దరు పిల్లలను హత్య చేసి | - | Sakshi
Sakshi News home page

ప్రియుడి మోజులో పడి.. ఇద్దరు పిల్లలను హత్య చేసి

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

– మహిళకు జీవిత ఖైదు

చిత్తూరు అర్బన్‌: ప్రియుడు మోజులో పడ్డ ఓ మహిళ తాను కన్న ఇద్దరు బిడ్డల్ని హత్య చేసింది. ఈ కేసు కోర్టులో రుజువు కావడంతో ముద్దాయి సి.పవిత్ర (25)కు జీవితకాలం జైల్లో ఉండాలని శిక్ష విధిస్తూ చిత్తూరులోని తొమ్మిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శరవణకుమార్‌ కథనం మేరకు.. రామకుప్పం మండలం, కవ్వంపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి పవిత్రతో పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ పిల్లాడికి ఆరేళ్లు, మరో బాలుడికి మూడేళ్ల వయస్సు ఉండేది. ఈ క్రమంలో తన ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వేమన్నతో పవిత్ర వివాహేత బంధాన్ని కొనసాగించేది. ఓ సారి వేమన్నతో పవిత్ర తిరుపతి వెళ్లగా పెద్దలు పిలిపించి మందలించారు. ఆపై వేమన్న బెంగళూరులో పనిచేస్తూ అప్పుడప్పుడు పవిత్రను కలిసేవాడు. ఎప్పటికై నా తమ అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డు వస్తారని పవిత్ర భావించింది. ఈ నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌ 9న అంగన్‌వాడీలో చదువుతున్న ఇద్దరు పిల్లలను పవిత్ర, వేమన్న తమ వెంట తీసుకువెళ్లారు. ఇద్దరు పిల్లలను పవిత్రతో పాటు తన ఇంటి వద్ద వదిలి వేమన్న వెళ్లిపోయాడు. కొద్దిసేపు తర్వాత ఓ నైలాన్‌ తాడు తీసుకుని ఇద్దరు పిల్లల గొంతుకు బిగించి అత్యంత దారుణంగా హత్య చేసిన పవిత్ర వారి మృతదేహాలను ఫ్యానుకు వేలాడదీసింది. ఆపై ఇంట్లో ఉన్న రూ.3 వేల నగదును తీసుకొని వేమన్నతో పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన వేమారెడ్డి తన ఇద్దరు పిల్లలు మిగతా జీవులుగా పడి ఉండడాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి రామకుప్పం ఎస్‌ఐ సురేష్‌బాబు కేసు నమోదు చేయగా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి న్యాయ స్థానంలో ప్రవేశపెట్టారు సాక్షులను విచారించిన న్యాయస్థానం వేమన్న పై నేరం రుజువు కాకపోగా అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది. పవిత్ర పై జంట హత్యల కేసు సాక్ష్యాదారాలతో నిరూపించడంతో ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ, రూ.1000 జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement