రెడ్‌క్రాస్‌ మరింత చురుగ్గా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ మరింత చురుగ్గా పనిచేయాలి

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ మరింత చురుగ్గా పనిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ సూచించారు. నూతనంగా ఎన్నికై న రెడ్‌క్రాస్‌ జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. పేదలకు సహాయ కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు, ఇతర మానవతా కార్యక్రమాల్లో సంస్థ మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్తనిల్వ సామర్థ్యం పెంపునకు అవసరమైన నిధులను కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం నూతన రెడ్‌క్రాస్‌ కమిటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ తేజోమూర్తి, వైస్‌ చైర్మన్‌ గోవర్దన్‌బాబి, కోశాధికారి రాజగోపాల్‌నాయుడును దుశ్శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, పలువురు రెడ్‌క్రాస్‌ సిబ్బంది సహదేవనాయుడు, గోపి, చిరంజీవి, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement