– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఉచ్చులు బిగుస్తున్నాయ్!
కౌండిన్య అభయారణ్యంలో వన్యప్రాణుల వేట గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. తుపాకుల మోత మోగుతోంది.
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు శూన్యం
బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026
జిల్లాలో వసతి గృహాల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పెచ్చులూడుతున్న స్లాబులు, మాసిపోయిన గోడలు, తిరగని ఫ్యాన్లు, విరిగిన కుర్చీలు, చాలీచాలని వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పేద విద్యార్థుల విద్యాలయాలను సర్వ హంగులతో తీర్చిదిద్దాల్సిన కూటమి నాయకులు పట్టించుకోవడమే మానేశారు. ‘చదువులకు పెద్దపీట వేస్తాం.. పేద పిల్లల వసతి గృహాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, కూరలు వడ్డిస్తాం’ అన్న మాటలు నీటిమూటలుగానే మారాయి. వేసవి సెలవులు ముగుస్తున్నా.. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నా ఇంతవరకు వసతుల రూపకల్పనపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన జిల్లా అధికారులు సైతం మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 28న జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు ఈ నెల 28న జరగాల్సిన పరీక్ష జూన్ 5వ తేదీకి వాయిదా వేశారని తెలిపారు. 28వ తేదీన ప్రభుత్వం బక్రీద్ పండుగకు సెలవు దినంగా ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 28న జరగాల్సిన మొదటి సంవత్సరం ఎకనామిక్స్ పేపర్1, వొకేషనల్ బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్ పేపర్ 1, బయాలజీ పేపర్ 1ను, 28వ తేదీ మధ్యాహ్నం జరగాల్సిన ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2, వొకేషనల్ బ్రిడ్జి కోర్సు, బయాలజీ పేపర్‌లను జూన్ 5వ తేదీకి మార్పు చేశారన్నారు. జూన్ 5 వ తేదీన జరగాల్సిన ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వాయిదా వేసిన పరీక్షలకు విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత హాల్‌టికెట్‌లతోనే హాజరుకావచ్చని, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
కలెక్టరేట్‌లో
జనగణన కంట్రోల్ రూమ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియలో సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రజలు ఏవైనా సమస్యలు, సందేహాలున్నట్‌లైతే 08572– 242734, 08572–242733 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సూచించారు.
పోలీసు కుటుంబానికి
ఆర్థిక సాయం
చిత్తూరు అర్బన్: అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన పిటి గిరిబాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని కుటుంబ సభ్యులకు ఐ డీఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.లక్ష చెప్పును స్థానిక పోలీసు కార్యాలయంలో మృతుడి భార్య, పిల్లలకు అందజేశారు. అలాగే సోమల స్టేషన్లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ రమేష్‌కు రూ.30 వేల చెక్కును ఎస్పీ అందజేశారు. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
జిల్లాలో హాస్టల్స్ వివరాలు
ఎస్సీ వసతి గృహాలు 57
ఎస్టీ వసతి గృహాలు 03
ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకులాలు 07
బీసీ వసతి గృహాలు 38
ట్రైబల్ గురుకులాలు 04
మహాత్మాగాంధీపూలే గురుకులాలు 05
ఏపీ రెసిడెన్షియల్ గురుకులాలు 02
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వస తి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. మౌలిక వసతులు లేక.. అంద విహీనంగా కొట్టుమిట్టాడుతున్నాయి. చంద్రబాబు సర్కారు చెబుతున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న చేతలకు అస్సలు పొంతన లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
అడ్మిషన్లపై అవగాహన ఎక్కడ?
విద్యాసంవత్సరం ప్రారంభంలోపు వసతి గృహాల పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అడ్మిషన్లపై అవగాహన కల్పించనే లేదు. సంక్షేమ వసతి గృహాల జిల్లా అధికారుల అలసత్వ అడ్మిషన్‌ల పై ప్రభావం చూపుతోంది. ఏ హాస్టల్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయి? దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? అనే విషయాలపై ప్రచారం చేయడం లేదు. ఫలితంగా వేలాది మంది నిరుపేద, దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులు హాస్టల్స్‌కు దూరమవుతున్నారు.
ఉత్తుత్తి ప్రకటనలకే సన్న బియ్యం
‘హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో రుచికరమైన భోజనం పెడతాం..’ అంటూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ హామీ కేవలం కాగితాలకే పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా ఏ హాస్టల్‌లో చూసిన ముక్కిపోయిన బియ్యం మూటలే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏటా నాసిరకం భోజనాన్నే పేద విద్యార్థులపై రుద్దుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే హాస్టళ్ల రూపురేఖలు మారుస్తామని కూటమి సర్కారు హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి.
నేటి నుంచి ఏనుగుల గణన
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో బుధవారం నుంచి ఏనుగుల గణనను ప్రారంభించనున్నారు. ప్రతి ఏటా నిర్వహించే గజ గణన గత సంవత్సరం నిర్వహించ లేదు. 2024లో జరిగిన లెక్కల ప్రకారం జిల్లాలో 110 వరకు ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. తదుపరి ఇప్పుడు లెక్కింపును ప్రారంభించనున్నారు. 27న చిత్తూరు, 29, 30 తేదీల్లో జిల్లాలో లెక్కింపు చేపట్టనున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులను లెక్కించనున్నారు. జిల్లాలోని చిత్తూరు ఈస్ట్, వెస్ట్, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పంలోని రేంజ్ల పరిధిలో 66 బీట్లల్లో 150 మంది సిబ్బంది, సహాయకులు కలిసి సర్వే చేయనున్నారు.
ప్రచార ఆర్భాటమే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే హాస్టల్ విద్యార్థుల కష్టాలు తీరు స్తామని చెప్పారు. హాస్ట ళ్ల రూపురేఖలు మారుస్తామని హామీలు గుప్పించారు. కానీ అవి ఎక్కడా అమలు కాలేదు. హాస్టళ్ల రూపురేఖలు మా రనూ లేదు. అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియపై కనీస అవగాహన కల్పించడం లేదు. సన్న బియ్యం పెడుతామని గొప్పలు చెప్పుకున్న పాలకులు అసలేం పట్టించుకోలేదు. జిల్లాలో మెజారిటీ హాస్టళ్లల్లో మౌలిక వసతులు బాగాలేవు. విద్యాసంవత్సరం ప్రారంభం లోపు అన్ని సౌకర్యాలు మెరుగుపరచా లని డిమాండ్ చేస్తున్నాం.
– ప్రవీణ్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా
చక్కని వసతి, వేదిక ఎక్కడ?
జిల్లాలోని మెజారిటీ హాస్టళ్లల్లో చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కరువైంది. వేసవి సెలవుల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయారు. చాలా వసతి గృహాల్లో విరిగిన కిటికీలు, సరిగ్గా వెలగని లైట్లు, ఫ్యాన్‌లు, అధ్వానపు గదులు దర్శనమిస్తున్నాయి. పేరుకేమో కార్పొ రేట్ స్థాయి వసతులు అంటారు... తీరా చూస్తే కనీసం కూర్చోవడానికి బెంచీలు, చదువుకునేందుకు స్టడీ టేబుళ్లు కూడా లేవని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
ప్రతి కుటుంబాన్నీ సందర్శించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జరుగుతున్న జనగణన ప్రక్రియలో ప్రతి కుటుంబ వివరాలను కచ్చితంగా, అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో జనగణన పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 2011 జనగణనతో పోలిస్తే ప్రస్తుత గణాంకాల్లో కొన్నిచోట్ల వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో ముఖ్యంగా ఖాళీ, తాళం వేసిన ఇళ్లు, ఉపాధి నిమిత్తం వెళ్లిన వలసల కారణంగానే జనాభా నమోదులో ఈ తేడాలు వస్తున్నాయని గుర్తించినట్లు తెలిపారు. అధికారులు ప్రతి ఇంటిని పరిశీలించి వాస్తవ సమాచారాన్ని మాత్రమే రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.


