చిత్తూరు కలెక్టరేట్ : గంగాధరనెల్లూరు ప్రాజెక్టులో పనిచేస్తున్న సీడీపీవోను సస్పెండ్ చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షకీలా, లలిత డిమాండ్ చేశా రు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆ సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ జీడీ నెల్లూరు సీడీపీవో అంగన్‌వాడీ కార్యకర్తలను, సహాయకులను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తోందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీల శ్రమను దోచుకుంటూ, నిరంకుశంగా వ్యవహరిస్తు న్న సీడీపీవోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జీడినెల్లూరు ప్రాజెక్టు కార్యదర్శి గోవిందమ్మ మాట్లాడుతూ సీడీపీవోపై గతంలో అక్రమామాల చరిత్ర ఉందన్నారు. ఆమె కార్వేటినగరం ప్రాజెక్ట్‌లో పనిచేసిన సమయంలో భారీ అక్రమాలకు పాల్పడగా, అప్పటి కలెక్టర్ విచారణ చేయించి చర్య లు చేపట్టారని గుర్తుచేశారు.
వర్కర్ల మధ్య గొడవలు పెడుతోంది!
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గుప్తా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఉదాసీనత వల్లే సద రు అధికారిణి మరింత బరితెగించినట్లు ఆరోపించా రు. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి అండగా ఉండాల్సిన అధికారిణి, వర్కర్ల, హెల్పర్‌ల మధ్య కులాల వారీ గా, వర్గాల వారీగా గొడవలు పెడుతున్నట్టు ఆరోపించారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు సురేంద్రన్, వాడ గంగరాజు, అంగనన్‌వాడీ యూనియన్ నాయకులు పద్మ, మమత, రెడ్డెమ్మ, భాను, కస్తూరిలతో పాటు జీడీనెల్లూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


