చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పారదర్శక సేవలతో ప్రజ ల వద్దకే పింఛన్‌లు పంపిణీ చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడంలో సచివాలయ సిబ్బంది మరింత జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో ప్రతి నెలా సు మారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో పింఛన్‌లు పంపిణీ చేస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్‌లు పంపిణీ చేయకూడదన్నా రు. ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్‌లు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను ప్రతి రెండు నెలలకోసారి డీపీఓ పర్యవేక్షణ లో తప్పనిసరిగా శుభ్రం చేయించాలన్నారు. ఈ సమీక్షలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, వయోజన విద్య డీడీ మహమ్మద్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్య సాధన దిశగా
అక్షరాంధ్ర ఫేజ్–2
జిల్లాలో 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలనే సంకల్పంతో అక్షరాంధ్ర రెండవ దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 57,325 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. అక్షరాంధ్ర యాప్‌లో అభ్యాసకులు, వలంటీర్ టీచర్ల అనుసంధాన (మ్యాచింగ్, బ్యాచింగ్) ప్రక్రియ మే 28 నుంచి ప్రారంభమై జూన్ 30 లోపు పూర్తి కావాలన్నారు.


