గౌరవ వేతనం విడుదల | - | Sakshi
Sakshi News home page

గౌరవ వేతనం విడుదల

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

చిత్తూరు కలెక్టరేట్‌: బీఎల్‌ఓలకు 2025–26 సంవత్సరానికి సంబంధించి రెండో విడత గౌరవ వేతనాలను నిధుల చేస్తూ రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 1,776 బీఎల్‌ఓలకు రూ.44 లక్షలను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు కేటాయిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉద్యోగుల విభజన తుది జాబితా

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కో జిల్లాల పునఃవిభజన నేపథ్యంలో ఉద్యోగుల తుది జాబితాను మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావ్‌ ప్రకటించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో సబ్‌ఇంజినీర్లు 33, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ 19, సీనియర్‌ సహాయకులు 72, జూనియర్‌ సహాయకులు 51, రికార్డు సహాయకులు 3, అటెండర్లు 30, ఫోర్‌మెన్‌ ముగ్గురిని జిల్లాకు కేటాయించారు. వీరు ఈనెల 31వ తేదీలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేశారు.

నిందితుడికి రిమాండ్‌

తవణంపల్లె: ఒంటరిగా ఉన్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్టు తవణంపల్లె ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం.. పుణ్యసముద్రం దళితవాడకు చెందిన లోకయ్య(64) ఎదురుగా ఉన్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మైనర్‌ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం కె.పట్నం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దగ్గర ముద్దాయి లోకయ్యను అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement