కుప్ప కూలిన బస్‌ షెల్టర్‌ | - | Sakshi
Sakshi News home page

కుప్ప కూలిన బస్‌ షెల్టర్‌

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

శాంతిపురం: కనుమలదొడ్డి నుంచి రాళ్లబూదుగూరు మీదుగా కర్ణాటకలోని కేజీఎఫ్‌ వెళ్లే రోడ్డు పక్కన కర్లగట్ట క్రాసు వద్ద ఉన్న బస్‌ షెల్టర్‌ కుప్పం కూలింది. మంగళవారం సాయంత్రం కొద్ది పాటి వర్షాని తోడు పెను గాలులు వీయడంతో బస్‌ షెల్టర్‌ ముందుకు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలో హెచ్‌పీ (హ్యూలెట్‌–ప్యాకర్డ్‌) సంస్థ ఇనుప పైపులు, రేకులతో ఈ బస్‌ షెల్టరును నిర్మించగా తర్వాతి కాలంలో దాని నిర్వహణ లేకపోవడంతో గాలి తాకిడికి కూలిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement