సెటిల్‌మెంట్లకు అడ్డ్డా.. వీకోట గడ్డ! | - | Sakshi
Sakshi News home page

సెటిల్‌మెంట్లకు అడ్డ్డా.. వీకోట గడ్డ!

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

● విలేకరి జగన్‌ హత్యతో వెలుగుచూస్తున్న సెటిల్‌మెంట్‌ బాగోతం ● వీటిపై స్పెషల్‌ ఫోకస్‌ తప్పదంటున్న

పోలీసులు

పలమనేరు: న్యాయం కోసం పోలీసుల వద్దకొచ్చే బాధితులే వారి టార్గెట్‌. సమస్యల్లో ఉన్నవారే పెట్టుబ డి. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా తాము ఎలాంటి పనులైనా చేయిస్తామంటూ నమ్మబలుకుతారు. తమ కు పోలీసులతోపాటు అధికారులు తెలుసునని నమ్మి స్తారు. తమకు రాజకీయనాయకుల అండ ఉందంటూ నమ్మిస్తారు. ప్రైవేటు పంచాయతీల ద్వారా సెటిల్‌ మెంట్లు చేసే గ్యాంగ్‌లు, ఏమార్చే ముఠాలకు పలమనేరు నియోజకవర్గంలోని వీకోట కేరాఫ్‌ అడ్రస్‌గా మా రింది. ఈ తంతు గత కొన్నేళ్లుగా సాగుతూ ఇటీవల తీవ్రరూపం దాల్చింది. వీకోట విలేకరి జగన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో భాగంగా పోలీసుల విచారణలో గ తంలో జరిగినపలు సెటిల్‌మెంట్ల వ్యవహారాలు బయ టపడుతున్నాయి.ఇలాంటి ముఠాలు నాలుగైదు దాకా వీకోటలో కార్యకలాపాలు చేసినట్టు సమాచారం.

ఏదైనా సరే..!

రాజకీయనేతలు, లాయర్లు, మీడియా, రౌడీగ్యాంగ్‌లతో సంబంధాలున్న సమాజంలో కాస్త పేరున్న కొందరు వేర్వేరు వింగ్‌లుగా ఏర్పడి వీకోటలో దందాలు నడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులు, రెవెన్యూ సమస్యల్లో ఇబ్బందిపడుతున్నవారు, మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా వీరు బాధితులను క్యాష్‌ చేసుకుంటున్నారు. ఈ పని చేస్తే మాకెంత అని రేటు పెట్టిమరీ దందాలు చేసినట్టు తెలుస్తోంది. వీరితో మోసపోయిన కొందరు వీరిపై పోలీసులకు సైతం పిర్యాదు చేయకుండానే ఉండిపోతున్నారు.

ఎక్కడైనా!

నియోజకవర్గంలోని రియల్టర్ల వ్యవహారాలు, లిటిగేషన్‌ భూములు, భూ ఆక్రమణలు ఇలాంటి ఏ వ్యవహారమైనా తాము సెటిల్‌ చేస్తామంటూ వీకోట గ్యాంగ్‌లు రంగంలోకి దిగి ఇరు పార్టీలకు చెందిన బడా నేతల వ్యవహారాలను సైతం గతంలో చక్కదిద్దినట్టు తెలుస్తోంది. బాధితులకు న్యాయం చేస్తామంటూ వారి తరుఫున మీడియాలో న్యూస్‌లు పెట్టించడం, ఽకార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయించడం, కోర్డులో కేసులు వేయించడం ఇలా ప్రతి పనికీ డబ్బులు వసూలు చేస్తుంటారని తెలిసింది.

వీరిని చూసి మరికొందరు!

ఇలాంటి సెటిల్‌మెంట్లను మనం చేసుకుంటే బాగుంటుందని మరికొందరు మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రంలోనూ తయారయ్యారు. వీకోట వ్యవహారంలో ఈ విషయాలు వెలుగుచూశాయి కాబట్టి తెలిసింది. కానీ పలమనేరు టౌన్‌తోపాటు మండల కేంద్రాల్లోనూ ఇదేన తరహా సెటిల్‌మెంట్లు చేసే ముఠాలున్నాయి. కొన్ని ప్రాంతాలు, డాబాలే వీరి సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా చేసుకోగా కొందరు ప్రైవేటు ఆఫీసులను సైతం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇకపై ఇలాంటి దందాలు చేసేవారిని వదిలిపెట్ట్‌ ప్రసక్తే లేదని పోలీసులు స్పెషల్‌ఫోకస్‌ పెట్టడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement