చిత్తూరు రూరల్ (కాణిపాకం): యాప్‌లలో రోజూ వివరాలు అప్డేట్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆయన బుధవారం ప్రోగ్రాం అధికారులతో చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని పరిశీలించిన ఆయన.. ప్రతిరోజూ అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ సంబంధిత యాప్‌లలో ఎప్పటికప్పుడు వివరాలు అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీలో సంజీవిని కార్యక్రమం కింద ఓపీకి వచ్చే ప్రతి రోగికి తప్పనిసరిగా ఏబీహెచ్‌ఏ క్రియేట్ చేసి కేస్ ఐడీకి అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, ఎస్‌ఓ జార్జ్, వైద్యులు ప్రవీణ్, అనిల్, గిరి, నవీన్ పాల్గొన్నారు.


