పలమనేరు నియోజకవర్గంలో.. | - | Sakshi
Sakshi News home page

పలమనేరు నియోజకవర్గంలో..

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

కౌండిన్య నది పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలమనేరు మండలంలో క్యాటిల్‌ఫాం, ముసలిమొడుగు, కూర్మాయి, చిన్నపేటకురప్పల్లి, మొరం గ్రామాల్లో విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు.

● గంగవరం మండల పరిధిలోని కలగుటూరు, కల్లుపల్లి, కొంగోళ్లపల్లి, నల్లగుట్లపల్లి, మారేడుపల్లి గ్రామాల్లో స్థానిక అధికార పార్టీ నేతలు ఇసుక తోడేళ్లుగా మారిపోయారు.

● పెద్దపంజాణి మండల పరిధిలోని మధురంపల్లి, పోలేపల్లి, గంగానంబండ, శివాడి గ్రామాల్లో అధికారుల కళ్లెదుటే ఇసుకను భారీగా తరలిస్తున్నారు.

● బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో రాత్రి పగలు తేడాలేకుండా ఇసుక తరలిస్తున్నారు.

● వీకోట మండలంలోని కొంగటంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement