ఏనుగుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఏనుగుల బీభత్సం

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

గుడిపాల: ఏనుగుల గుంపు గ్రామ సమీపంలోకి వచ్చి పంట పొలాలను ధ్వసం చేసింది. బుధవారం తెల్లవారుజామున ముత్తువాళ్లూరు గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దకు వచ్చి అరటి, మామిడి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేయడంతో పాటు ఫెన్సింగ్‌, పైపులన్నింటినీ విరగ్గొట్టాయి. మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. కాయలను నేలరాల్చి తినేసినట్టు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని పలువురు కోరుతున్నారు.

జిల్లా ఫుట్‌బాల్‌ సంఘ

నూతన కమిటీ ఎన్నిక

పలమనేరు: చిత్తూరు జిల్లా ఫుట్‌బాల్‌ సంఘ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆ మేరకు పట్టణంలో బుధవారం ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ రాష్ట్ర సంఘ నాయకుల ఆధవర్యంలో జరిగింది. జిల్లా సంఘ అధ్యక్షుడిగా హేమంత్‌రెడ్డి, ఉపాధ్య షుడిగా కిశోర్‌, కార్యదర్శిగా విక్రమ్‌రాజ్‌, ట్రెజరర్‌గా సుబ్రమణ్యం నాయుడుతోపాటు మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులు ఎంపికయ్యారు. జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీడను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ కార్యవర్గం పనిచేస్తుందని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement