ఎర్రచందనం నిందితుడిపై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం నిందితుడిపై పీడీ యాక్ట్‌

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడైన తమిళనాడుకు చెందిన రామకృష్ణన్‌ ముత్తు ఎలియాస్‌ రామకృష్ణపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పీడీ యాక్ట్‌ అమలు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె కులశేఖర్‌ మార్గదర్శకత్వంలో స్మగ్లింగ్‌ పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్‌లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన నిందితుడు రామకృష్ణన్‌ ముత్తు ఎలియాస్‌ రామకృష్ణపై పీడీ యాక్ట్‌ అమలుకు సిఫారసు చేశారు. ఈ మేరకు కలెక్టరు వెంకటేశ్వర్‌ పీడీ యాక్ట్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు రామకృష్ణపై ఏడు ఎరచ్రందనం కేసులు ఉండగా, టాస్క్‌ఫోర్స్‌లో నాలుగు, సుండుపల్లి, కలికిరి పోలీసు స్టేషన్లుతో పాటు, పీలేరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో ఒక్కొక్క కేసు ఉంది. పీడీ యాక్ట్‌ అమలులో భాగంగా నిందితుడిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఒకటి నుంచి ఇయర్లీ ప్యాటర్న్‌ ప్రాక్టికల్స్‌

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఇయర్లీ ప్యాటర్న్‌ విధానంలో యూజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు చివరి అవకాశంగా ప్రాక్టికల్స్‌ పరీక్షలను జూన్‌ ఒకటి నుంచి 10వ తేదీ వరకు ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఇయర్లీ ప్యాటర్న్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement