రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

– డీఐఈవో రఘుపతి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న ట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగుకుండా కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీ య సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ లో పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు.

51 విద్యుత్‌ సమస్యల గుర్తింపు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో మంగళవారం 40 సెక్షన్ల పరిధిలో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 37 సమస్యలు, డీటీఆర్‌ 1, ఎల్‌టీ లైన్ల పరంగా 13.. మొత్తం 51 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులకు నివేదిక సమర్పించినట్టు వెల్లడించారు.

నేడు కుప్పంకు సీఎం రాక

కుప్పం: సీఎం చంద్రబాబునాయుడు బుధవారం కుప్పంలోని శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనంలో పాల్గొ ననున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం తరుఫున అమ్మవారికి సారే సమర్పిస్తారని పేర్కొన్నారు.

ముగిసిన ఉద్యోగుల కేటాయింపు

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కో జిల్లాల పునర్‌విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన ముగించా రు. ఆ వివరాలను మంగళవారం ప్రకటించారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాల పరంగా సీనియర్‌, జూనియర్‌ ఉద్యోగులు వారు కోరుకున్న స్థానాల కోసం ఆప్షన్‌ పెట్టుకున్నారు. అందులో పలు విభాగాల నుంచి 200 మందిని జిల్లాకు కేటాయించారు. ఇందులో జేఈ 33, జేఏఒ, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్‌మెన్లు, ఫోర్‌మెన్స్‌, లైన్‌ఇన్స్‌స్పెక్టర్లు 167 మందిని జిల్లాకు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఎక్కువగా సీనియర్లను జిల్లాలో ఉంచి, జూనియర్లను పక్క జిల్లాలకు బదిలీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement