విచారణకు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

విచారణకు ఆదేశం

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : నగరి నియోజకవర్గం, విజయపురం మండలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్‌ జె.రాముతో పాటు మరో ఇద్దరు రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు నిబంధనలను ఉల్లఘించారనే ఆరోపణలతో విచారణకు ఆదేశించారు.

ముగ్గురి పై అభియోగాలు

విజయపురం మండలంలో విధులు నిర్వహించిన తహసీల్దార్‌ జే.రాము, మాజీ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస, మరో అధికారి ప్రభుత్వ సేవా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై 2023 జనవరిలో ఆ ముగ్గురు అధికారులకు మెమోలు, చార్జ్‌షీట్‌లు జారీచేసినట్టు వెల్లడించారు. డీఆర్‌వోను విచారణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు నెలల్లోపు పూర్తి నివేదిక సమర్పించాలని డీఆర్‌వోను ఆదేశించారు.

సీపీఎల్‌–2లో స్పార్టన్‌

వారియర్స్‌ విజయకేతనం

వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడా మైదానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీపీఎల్‌–2లో 9వ రోజు ఉదయం స్పార్టన్‌ వారియర్స్‌, హైపెరియన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. ఇందులో మొదటగా బ్యాటింగ్‌ చేపట్టిన హైపెరియన్‌ జట్టు 14 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్పార్టన్‌ వారియర్స్‌ 13.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెడ్డిప్రకాష్‌ 26 బాల్స్‌లో 45 పరుగులు చేసి మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ ట్రోఫీ ని అందుకున్నాడు. మధ్యాహ్నాం ఎన్‌కే స్పోర్ట్స్‌, నితిన్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఎన్‌కే స్పోర్ట్స్‌లో టాస్‌ గెలిచి ఎన్‌కే ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన నితిన్‌ వారియర్స్‌ 20 ఓవర్‌లల్లో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. 141 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఎన్‌కే స్పోర్ట్స్‌ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు తేడాతో 143 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్య క్షంగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ క్రికెట్‌ పోటీలను వీక్షించారు. ఈ మ్యాచ్‌ లో 35 పరుగులు చేసి, 3 వికెట్లు పడగొట్టిన ఎన్‌కే స్పోర్ట్స్‌ ప్లేయర్‌ హేమాద్రినాయుడుకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. శ్రీధర్‌కుమా ర్‌, సునీల్‌కుమార్‌, సతీష్‌యాదవ్‌ పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 80,455 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 43,309 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది.

సిద్ధార్థలో

గ్రాడ్యుయేషన్‌ డే

నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్‌ డేను మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సుదర్శనరావు పాల్గొని పాస్‌ అవుట్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మెడల్స్‌, పట్టాలను అందజేశారు. కళాశాల ఆడిటోరియంలో జరిగిన కాన్విగేషన్‌ డే సమావేశంలో కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతి విద్యను అందివ్వడానికి కృషి చేస్తున్నామన్నారు. 17 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్‌ ప్రశాంతి, అరుణక్రాంతి, ప్రిన్సిపల్‌ మధు, జనార్దరాజు, నామిని ఫ్రొఫెసర్‌ పద్మసువర్ణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్జామినర్‌ విజయభాస్కర్‌, గోపి, హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement