జగన్‌ హయాంలో యాదవులకు సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ హయాంలో యాదవులకు సముచిత స్థానం

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

కార్వేటినగరం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే యాదవులకు సముచిత స్థానం లభించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. యాదవ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా నియామకమైన ధనశేఖర్‌యాదవ్‌ కార్వేటినగరం మండల కేంద్రంలోని 50 మంది నాయకులు, కార్యకర్తలతో కలసి మంగళవారం పుత్తూరులోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ డెప్యూటీ సీఎం మాట్లాడుతూ నాలుగు దపాలుగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు యాదవులను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేశారన్నారు. జగనన్న హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలా అండగా నిలిచారని గుర్తుచేశారు. అనంతరం ధనశేఖర్‌యాదవు మాట్లాడుతూ అందరితో కలసి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందు అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు మాజీ డెప్యూటీ సీఎంతోపాటు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మికి రుణపడి ఉంటామన్నారు. అనంతరం నియోజకవర్గ యాదవ విభాగం అధ్యక్షుడు ధనశేఖర్‌యాదవును మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. మండల మహిళా అధ్యక్షురాలు మోహనమ్మ, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు దొరబాబు, పురుషొత్తంరాజు, శ్రీనివాసులురెడ్డి, శరవణ, ఆరుముగం, రఫీ, సుమతి, అభింక, కుమార్‌ అచారి, అరుణ, పయణిరెడ్డి, సుమన్‌, మణి, చింటు, గిరి, సాయి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement