కరెంటు కోతలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

కరెంటు కోతలపై నిరసన

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

● తాళంబేడు సబ్‌స్టేషన్‌ ఎదుట జంభూగోళంపల్లె గ్రామస్తుల ధర్నా

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): పండగ పూట కోతలు పెట్టారని నిరసిస్తూ మంగళవారం జంభూగోళంపల్లె గ్రామస్తులు చిత్తూరు మండలం తాళంబేడు సబ్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఏఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ, ఉదయం 7 గంటలకు కరెంటు కట్‌ చేశారన్నారు. ట్రాన్స్‌కో అధికారులకు ఫోన్‌ చేస్తే స్పందించలేదన్నారు. ఉదయం 11 గంటలు దాటినా కరెంటు రాకపోవడంతో సబ్‌స్టేషన్‌ వద్దకు వచ్చినా తమ సమస్యను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. ఇకనైనా ఈ సబ్‌ స్టేషన్‌ పరిధిలో కరెంటు కోతలకు స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఏఈను వివరణ కోరగా..అనవసరంగా కరెంటు కోతలు విధించలేదని, బీఎన్‌ఆర్‌ పేట, తాళంబేడు సబ్‌ స్టేషన్‌కు కరెంటు సరఫరా రాలేదని సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement