పుచ్చలపల్లె సుందరయ్యకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

పుచ్చలపల్లె సుందరయ్యకు ఘన నివాళి

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

చిత్తూరు కార్పొరేషన్‌: స్వాతంత్య్ర సమరయోధుడు పుచ్చలపల్లె సుందరయ్య 41వ వర్ధంతిని మంగళవారం చిత్తూరు సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర నాయకులు సుబ్బారావు మాట్లాడారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ పేదల అభ్యున్నతి కోసం పుచ్చలపల్లె అవిరళ కృషి చేశారని కీర్తించారు. దళితుల హక్కుల కోసం పోరాడారని, వారికి అండగా నిలబడ్డారన్నారు. దోపిడి రహిత సమాజం కోసం శ్రమించారని పేర్కొన్నారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన మహానేత అని, సమాజాభివృద్ధిని కాంక్షించిన ఆయన వివాహం కూడా చేసుకోలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు, నాయకులు రమాకాంత్‌, సురేంద్రన్‌, ఓబుల్‌రాజు, గిరిధర్‌గుప్తా, షకీల, ప్రసాద్‌, బాలసుబ్రమణ్యం, దాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement