92 కి.మీ దూరం పనులు చేయాల్సిన ఈ ప్రాజె క్టు ప్రస్తుతం 75 కి.మీ వరకు పూర్తయ్యాయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా 60 శాతం మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. పైపులైను పను లు ప్రస్తుతం చిత్తూరు సమీపంలోని పెనుమూరు క్రాస్ వద్ద ఆగిపోయింది. పూతలపట్టు సమీపంలోని రంగంపేట కూడలి, పీలేరు ప్రాంతాల్లో జాతీయ రహదారిపై రోడ్డును కట్ చేసి అందులో పైపులు పెట్టాల్సిన పనులు కదల్లేదు. దామలచెరువు సమీ పంలోని పుదిపట్లబైలు సమీపంలో 37 ఎంఎల్‌డీ సామ ర్థ్యంతో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రిజర్వాయ్‌లోపల ఇన్‌టేక్ వెల్ (బావి) పనులు పూర్తికాలేదు. చిత్తూరు నగరంలోని కై లాశపురం వద్ద 16 లక్షల లీటర్ల నిల్వ చేసే ట్యాంకు నిర్మించాల్సి ఉంది. నగరంలో 60 కి.మీ వరకు పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులు అసలు ప్రారంభించనేలేదు.


