పిల్లలు ఫెయిలైతే తల్లి దండ్రులు తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమీ కాదు. మరోసారి మంచిగా చదివి ఉత్తీర్ణత సాఽ దించాలని ప్రోత్సహించాలి. అప్పుడే విద్యా ర్థులు క్షణికావేశానికి లోనుకాకుండా ఉంటారు. పెద్దగా చదువుకోలేని వారు.. పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు సైతం ప్రస్తుతం వ్యాపారాల్లో రాణించి ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరి లో ప్రతిభ దాగి ఉంటుంది. తల్లిదండ్రులు దానిని గుర్తించి, పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించాలి. – పాండురంగస్వామి, మాజీ డీఈవో


