ఇటీవల నరిగపల్లిలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో ఇసుక డంప్ బయటపడింది. అక్కడి నుంచి గుడిపాల మీదుగా తమిళనాడుకు వెళుతున్న ఇసుక టిప్పర్‌ను గుడిపాల పోలీసులు పట్టుకున్నారు. పైన కంకర వేసుకుని వెళుతున్న ఇసుక టిప్పర్‌ను పోలీసులు కాపుకాచి పట్టుకున్నారు. దీంతో అలెర్ట్ అయిన మాఫియా రూట్ మార్చారు. పైన కంకర కప్పుకుని పొద్దునే గాజులపల్లి క్రాస్ అయ్యి.. మాపాక్షి, తుమ్మింద మీదుగా తమిళనాడుకు తరలించేస్తున్నారు. సరిగ్గా ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య మూడు టిప్పర్లు.. ఈ మార్గంలో సరిహద్దులు దాటుతున్నాయి. రాత్రి 9గంటలకు పైగా రాకపోకలు సాగిస్తున్నాయి.
బీఎన్‌ఆర్‌పేట నుంచి రాత్రి 7.30గంటల ప్రాంతంలో టిప్పర్లు, లారీల ద్వారా సరుకు తమిళనాడుకు తరలిపోతోంది. బండి చీలాపల్లి వద్ద మళ్లీ.. గుడిపాల మీదుగానే తమిళనాడుకు చేరుతోంది.
ఓ ప్రజాప్రతినిధి బంధువుగా చెప్పుకుని ఇద్దరు యువనేతలు కలిసి మంచినీళ్ల కుంటను అడ్డాగా చేసుకుంటున్నారు. అక్కడ ఇసుక దోపిడీలో ము నిగి తేలుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా వీళ్ల వ్యాపారం సాగుతోంది. మంచినీళ్ల కుంట నుంచి యమా స్పీడుతో...రామాపురం, కమ్మతిమ్మపల్లి మీదుగా తమిళనాడుకు దూసుకెళుతోంది.
గుడిపాల మండలం సీఎం కండ్రిగలో కూడా ఇద్దరు యువనేతలకు మరో డంప్‌నకు శ్రీకారం చుట్టారు. ఆ డంప్‌లో టన్నుల కొద్దీ ఇసుక నిల్వ చేసుకుని టిప్పర్లల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు. కానీ వీళ్లను టచ్ చేసేందుకు ఏ అధికారీ సాహసం చేయకపోవడం గమనార్హం.
మురకంబట్టులో మూడు డంప్‌లున్నాయి. ఈ మూడు డంప్‌లకు పూతలపట్టు మండలంలోని వావిల్‌తోట, జీడీనెల్లూరులోని కొట్రకోన ప్రాంతాల నుంచి ఇసుక చేరుతోంది. ఆ డంప్‌ల నుంచి రాత్రి 7.30 గంటల ప్రాంతంలో లారీలు లోడ్ చేసుకుని మురకంబట్టు క్రాస్, మంగసముద్రం సర్కిల్, ఇరువారం బ్రిడ్జి మీదుగా గుడిపాల జాతీయ రహదారిపై తమిళనాడుకు చేరుతోంది. కొందరు అధికారులకు మామూళ్ల మత్తులో మాఫియాకు దాసోహమై తమిళనాడు వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఇటీవల మురకంబట్టు నుంచి ఇసుక తరలిస్తూ.. పట్టుబడ్డ మురకంబట్టు నేతకు రూట్ క్లియర్ అయ్యిందని సమాచారం. వీరిలో కొందరు వరిపొట్టు కప్పుకొన్ని దందా నడిపిస్తున్నారు.
ఇంధన కష్టాలు
అక్రమ ‘మార్గం’
నగరి: పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనదారుల రద్దీ
నగరి: డీజిల్ కోసం పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన కార్లు
జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టడం కనిపించింది. చాలా బంకుల వద్ద డీజిల్ అందుబాటులో లేదంటూ బోర్డులు వెలిశాయి. ఆటో, ట్రాక్టర్, లారీ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో డీజిల్ కొరత ప్రభావం పెట్రోల్‌పైనా పడింది. రాబోయే రోజుల్లో పెట్రోల్ కూడా దొరకకపోవచ్చన్న భయంతో ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూకట్టి ఫుల్ ట్యాంక్ నింపుకుంటున్నారు. – నగరి
చిత్తూరు చుట్టుపక్కలా అనధికారిక ఇసుక డంప్‌లు
చిత్తూరు చుట్టుపక్కలా ఇసుక తోడేళ్లు మాటు వేశాయి. అదును చూసి ఇసుక డంప్‌లు సిద్ధం చేస్తున్నాయి. ఆపై పోలీసులు, అధికారుల కళ్లెదుటే తమిళనాడుకు తరలిస్తున్నాయి. విచ్చలవిడిగా జేబులు నింపుకుంటు చెలరేగిపోతున్నాయి. అయితే ఈ దందాను చంద్రబాబు ప్రభుత్వంలోని మరో వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. అక్రమార్కులపై హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై చిత్తూరులో సర్వత్రా చర్చ సాగుతోంది.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు ఇసుక దోపిడీయే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చిత్తూరు మండలంలోని బీఎన్‌ఆర్‌పేట ప్రాంతం, పూతలపట్టు మండలంలోని వావిల్‌తోట, జీడీనెల్లూరు మండలంలోని కొట్రకోన తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారు. అక్కడ తవ్వకాలు చేసుకుని చిత్తూరు నగరం, మండల సరిహద్దు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. బీఎన్‌ఆర్‌పేట, మంచినీళ్లకుంట, సీఎం కండ్రిగ, మురకంబట్టు, కొత్తగా నరిగపల్లిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద భారీగా నిల్వ చేస్తున్నారు.
అధికారుల చోద్యం
ఇసుక దందా చిత్తూరులో పేట్రోగిపోతోంది. బహిరంగంగా ప్రజాప్రతినిధుల పేరుతో ఇసుక దందా నడుస్తోంది. పలు శాఖల అధికారులు మాఫియా ఉచ్చులో పడిపోతున్నారు. దందా సాగుతున్నా మామూలేకదా అని లైట్ తీసుకుంటున్నారు. కళ్లెదుటే ఇసుక టిప్పర్లు తిరుగుతున్నా పట్టించుకోవడవం లేదు. పై అధికారులు అడిగినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
సొంత పార్టీ నేతల గుర్రు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్లను తోసిపుచ్చేశారని కొందరు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంతా పిల్ల నాయకులదే పెత్తనమంటూ.. సీనియర్లు మండిపడుతున్నారు. ఏళ్ల తరబ డి పార్టీకి కష్టపడితే కష్టం మాది.. ఫలాలు వారికా అంటూ..మండిపడిపోతున్నారు. ఇసుక అక్రమ వ్యాపారాల్లో నిన్నగాక మొన్నవొచ్చిన వాళ్లకే పగ్గాలు ఇస్తారా..? అంటూ విరుచుకుపడుతున్నారు. దీన్ని జీర్ణించుకోని సీనియర్లు కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్టు కొందరు నేతలు బహిరంగంగా చెప్పుకుంటు న్నారు. ఇసుకాసురుల ఆగడాలు శ్రుతి మించి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని చెప్పుకొస్తున్నట్టు సమాచారం.


