వేసవి దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

వేసవి దొంగల హల్‌చల్‌

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

● జిల్లాలో వరస చోరీలతో బాధితుల బెంబేలు ● విహార యాత్రలకు వెళుతూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు ● అవి చూసి ధైర్యంగా చోరీలకు వెళుతున్న దొంగలు ● అప్రమత్తతోనే చోరీలు అరికట్టొచ్చంటున్న పోలీసులు ● ఎవరైనా ఊర్లకెళ్లడానికి ముందు తప్పనిసరిగా మీ పరిధిలోని స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. అప్పుడే లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా చోరీ జరగకుండా మీ ఇంటిని పర్యవేక్షిస్తాం. ● ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు. సెంటర్‌ లాక్‌ వేసి, బయట గేటుకు లోపలి నుంచి తాళం వేయా లి. ● శుభకార్యాలు, తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచకుండా, బ్యాంకు లాకర్లో భద్రపరచాలి. బీరువా తాళాలను ఇంట్లో ఉంచకండి. ● సామాజిక మాధ్యమాల్లో విహారయాత్ర వివరాలను పోస్టు చేయొద్దు. దీనివల్ల మీరు ఊర్లోలేరనే విషయం తెలిసిపోతుంది. ● ఆరుబయట నిద్రించే సమయంలో ఒంటిపై ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఉంచుకోవద్దు. ● సీసీ కెమెరాలతో దొంగలను సులభంగా పట్టుకోగలం. ఇళ్ల సమీపంలో, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. వాటిని బిగించుకోవాలని సూచిస్తున్నాం.

చిత్తూరు నగరంలోని మురకంబట్టులో రెండు రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. దాదాపు 160 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు.. రూ.3 లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకుని, అందరూ బయట వెళ్లడం.. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమే ఈ చోరీకి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు.

పలమనేరు నియోజకవర్గంలోని గంగవరంలో పంచాయతీరాజ్‌ ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసులు కుటుంబం కాకినాడ వెళ్లారు. ఇంట్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు సైతం ఉంచారు. తలుపునకు తాళం వేసి ఉండడాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు.. తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇక్కడా బాధితులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు.’’

స్మార్ట్‌ లాక్‌ ఉత్తమం

వేసవిలో పట్టణాలు, గ్రామాల్లో చాలామంది ఆరుబయట, మిద్దైపెన నిద్రపోవడం అలవాటు. ఇదే అదునుగా నిద్రించే వారి బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు ఎత్తుకెళుతున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి దోచేస్తున్నారు. జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో స్మార్ట్‌ లాక్‌లను ప్రజలకు తెప్పించి ఇచ్చాం. ఇలా శబ్దాన్ని మోగించడం వల్ల ప్రజలు అప్రమత్తం అవ్వొచ్చు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. పోలీసు శాఖ తరఫున రాత్రివేళ గస్తీ ముమ్మురం చేసేందుకు ప్రణాళిక రూపొందించాం.

సమాచారమిస్తే..

.. ఈ రెండు ఘటనలేకావు.. జిల్లాలో తరచూ ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. వేసవి సరదాలనే కాదు.. దొంగల బెడదనూ తెచ్చిపెడుతోంది. సెలవుల్లో సొంతూర్లకు వెళ్లడం, విహార యాత్రలు, ప్రయాణాలు, శుభకార్యాలు, ఆరుబయట నిద్ర లాంటివి దొంగలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఊరికి వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేయాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకోకుంటే దొంగలు చొరబడి ఉన్నదంతా ఊడ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీ సూచిస్తున్నారు. ఆయన సూచనలు ఇలా.. – చిత్తూరు అర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement