చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు.
నేడు నిండ్రలో పీజీఆర్‌ఎస్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం నగరి నియోజకవర్గం నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
నేడు పలమనేరులో
పోలీస్ గ్రీవెన్స్
పలమనేరు/ చిత్తూరు అర్బన్ : పలమనేరులోని డీఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో పోలీస్ గ్రీవె న్స్ కార్యక్రమం నిర్వహించనన్నునట్టు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉద యం 10.30 గంటలకు మొదలవుతుందని, పోలీసులకు సంబంధించి లేదా అన్యాయం, అక్రమా లు జరిగిన బాధితులు నేరుగా వచ్చి ఎస్పీతో విన్నవించాలని అందులో సూచించారు.
కాణిపాకం కిటకిట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూలో నిరీక్షించడం కనిపించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలో తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
ఆన్‌లైన్‌లో మెరిట్ జాబితా
చిత్తూరు కలెక్టరేట్: విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల తాత్కాలిక (మెరిట్) జాబితాను www.chittoor.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచామని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వినోద్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఆ వెబ్‌సైట్‌ను సందర్శించి అభ్యంతరలుంటే రాత పూర్వకంగా ఆ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. సోమవారం నుంచి మే 1 సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయపు పనివేళ్లలో సంబంధిత పత్రాలను ఇవ్వాలన్నారు. ఉద్యోగాల పేరిట దళారులు, మధ్యవర్తుల ప్రమేయానికి గురికాకుండా అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
డీజిల్ నిల్!
కాణిపాకం: జిల్లా పరిధిలో డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చుతోంది. గత కొన్ని రోజులుగా సరఫరాలో జాప్యం నెలకొనడంతో పలు పెట్రోల్ బంక్‌లలో డీజిల్ నిల్వలు ఖాళీవుతున్నాయి. వాహనదారులు పలు బంక్‌ల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బంక్ డీలర్లు సైతం డీజిల్ పట్టేందుకు కొన్ని నిబంధనలు పెట్టారు. బల్క్ డీజిల్‌కు కొంత వరకు మాత్రమే పరిమతం చేశారు. వేల లీటర్లకు నో చెబుతున్నారు. డ్రమ్‌లు తేవద్దని తిప్పి పంపిస్తున్నారు. జిల్లా లో 146 పెట్రోల్ బంక్‌లుండగా.. 30కిపైగా మూతపడ్డాయి. దీనికితోడు 60బంక్‌ల్లో డీజిల్ నిల్వలు జీరో స్థాయికి చేరాయి. ఈ సమస్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది.


