సీఆర్‌రెడ్డికి నివాళి | - | Sakshi
Sakshi News home page

సీఆర్‌రెడ్డికి నివాళి

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

● ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వందేళ్లు ● ఆయన కృషి మరువలేనిది ● కట్టమంచి హరిణిరెడ్డి

● ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వందేళ్లు ● ఆయన కృషి మరువలేనిది ● కట్టమంచి హరిణిరెడ్డి

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యా ప్రదాత దివంగత సీఆర్‌రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) అని వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ కట్టమంచి హరిణిరెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్‌ బంగ్లా వద్ద గల సీఆర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఆమె ఆధ్వర్యంలో నాయకులు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించి వందేళ్లు అయ్యిందన్నారు. దాని ఏర్పాటు వెనుక ఆయన కృషి ఎంతో ఉందన్నారు. సీఆర్‌రెడ్డి శాసనసభలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 1926లో ఏర్పడిన విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్‌గా సేవలందించారన్నారు. ఆయన వేసిన విద్యా పునాదులే కోట్లాది మందికి చదువు నేర్పిందన్నారు. హరిజనులకు పాఠశాలలో ప్రవేశం కల్పించడానికి అప్పట్లో కృషి చేశారన్నారు. ప్రతి ఊరికీ పాఠశాల అనే ఉద్యమాన్ని ప్రారంభించారని వివరించారు. కార్యక్రమంలో నాయకులు తలుపల్లి బాబురెడ్డి, విజయసింహారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, చిత్తూరు రెడ్డి జేఏసీ సభ్యులు హరిప్రసాద్‌రెడ్డి, శివరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 80,350 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,597 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement