చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సంక్షేమ, విద్యా సహాయకులకు వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు అంకమ్మరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో సంక్షేమ, విద్యా సహాయకుల అసోసియేషన్ సమావేశం, జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సచివాలయం విద్యా సహాయకులకు తక్షణమే ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ మార్పు, పెండింగ్‌లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్‌లను త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
సంక్షేమ, విద్యాసహయకుల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా రాజకుమార్, జనరల్ సెక్రటరీగా మురళీనాథ్, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాసులు, శ్రావణకుమార్, ట్రెజరర్‌గా మదన్‌మోహన్, జాయింట్ సెక్రటరీగా రోహిణికుమార్,వినయ్, మహిళా అధ్యక్షురాలుగా సృజనను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.


