మస్టర్ల మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

మస్టర్ల మాయాజాలం

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

● క్షేత్ర సహాయకుల చేతివాటం ● బినామీ మస్టర్లతో నిధుల స్వాహా

కార్వేటినగరం : జాతీయ ఉపాధిహామీ పథకంలో అక్రమాలను అరికట్టేండుకు ప్రభుత్వం ఎన్ని విధానాలను ప్రవేశ పెడుతున్నా క్షేత్ర స్థాయిలో సిబ్బంది దోపిడీకి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. క్షేత్ర సహాయకులు ఉపాధిహామీ సిబ్బంది కుమ్మకై ్క బోగస్‌ మస్టర్లతో నిధులను మింగేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉపాధిహామీ పథకంలో పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ప్రతి కూలీ వారి ముఖాన్ని ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌(ఫేస్‌రిగ్నైజేషన్‌ సిస్థ)లో నమోదు చేయాలి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేసే సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎక్కడి నుంచి ట్యాగ్‌ చేశారో అక్కడ మాత్రమే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అవుతుంది. అయితే ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేతి వాటంతో వారికి అనుకూలంగా ఉన్న వారికి పనులు చేయించి.. అక్కడ ఫీల్డ్‌అసిస్టెంట్‌ ఒక కూలీ ముఖాన్ని ఆన్‌లైన్‌లో పెట్టి మిగిలిన వారికి హాజరు నమోదు చేస్తున్నారు. వాస్తవంగా కష్టపడి పనులు చేసిన కూలీలకు తక్కువగా బిల్లులు పడుతున్నాయి. బినామీ మస్టర్లతో ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చేవారికి ఎక్కువగా బిల్లులు వస్తున్నాయని పలువురు కూలీలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో ఫీల్డ్‌అసిస్టెంట్లు టీడీపీ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి అక్రమాలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులు స్పందించి ఉపాధిహామీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని పలువురు కూలీలు కోరుతున్నారు.

ఒక ఫొటోని ఆన్‌లైన్‌ చేసి..

ఒక ఫొటోని ఆన్‌లైన్‌ చేసి ఏడుగరికి హాజరు

Advertisement
 
Advertisement
Advertisement