ప్రసవాల సంఖ్యను పెంచండి | - | Sakshi
Sakshi News home page

ప్రసవాల సంఖ్యను పెంచండి

Apr 26 2026 2:57 AM | Updated on Apr 26 2026 2:57 AM

గుడిపాల: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పుల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్‌ఓ శశిభూషణ్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎండలు తీవ్రంగా ఉండడంపై హీట్‌స్ట్రోక్‌పై అవగాహన కల్పిస్తూ గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎమ్‌లు, ఆశావర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కాన్పుల సంఖ్యను పెంచి 24గంటలు వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డాక్టర్లు సంధ్య, చంద్రమహేష్‌, స్టాఫ్‌నర్స్‌ పవిత్ర, వనజ, సీహెచ్‌ఓ సూర్యనారాయణ, సిబ్బంది త్రిలోక్‌, విజయ, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement