త్రుటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Apr 26 2026 2:57 AM | Updated on Apr 26 2026 2:57 AM

● ఐచర్‌ వాహనం బోల్తా ● గాయాలతో బయటపడ్డ డ్రైవర్‌, క్లీనర్‌

శ్రీరంగరాజపురం: ఐచర్‌ వాహనం బోల్తా పడిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట సమీపంలోని చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా... చిత్తూరు జిల్లా మొలకల చెరువు నుంచి శ్రీరంగరాజపురం మండలంలోని మొదవాడ గ్రామానికి చెందిన ఓ కోళ్ల ఫారానికి మొక్కజొన్నల లోడ్‌తో వెళ్తూ 49 కొత్తపల్లిమిట్ట సచివాలయం సమీపంలో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో స్పందించిన స్థానికులు స్వల్పగాయాలతో బయటపడిన వాహనం డ్రైవర్‌, క్లీనర్‌లను చికిత్స నిమిత్తం ఆరిమాకులపల్లి పీహెచ్‌సీకి తరలించారు.

టైరు పేలడంతో..

మొలకల చెరువు నుంచి మొక్కజొన్న లోడ్‌తో మొదవాడకు వస్తున్న ఐచర్‌ వాహనం టైర్‌ పేలి అదుపుతప్పి బోల్తా పడిన చోట ఒక్క అడుగు దూరంలో 33/కేవీ విద్యుత్‌ స్తంభం ఉంది. బోల్తాపడిన వాహనం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకుని ఉండేదని, ఒక్క క్షణంలో ప్రమాదం తప్పిందని జనం ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement