చిత్తూరు కార్పొరేషన్: గ్రంథాలయాల్లో బాలబాలికలకు వేసవి శిక్షణ శిబిరాలను ఈనెల 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో వేసవి శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 71 శాఖా గ్రంథాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తారన్నారు. వ్యక్తిత్వ వికాసం, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ, హ్యాండీ క్రాఫ్ట్స్, ఆటల్లో శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ, ఉప గ్రంథాలయాధికారిణి లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.


