తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీకి చెందిన శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్టుకు రూ.10 లక్షలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటీ సంస్థ యజమాని ససపు శ్రీనివాస్ విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళ డీడీని శనివారం స్థానిక పరిపాలనా భవనంలో టీటీడీ ఈఓ రవిచంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్టణానికి చెందిన చీఫ్ ఇంజినీర్ డి.శ్రీనివాస్‌రావు, రైల్వే అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


