చిత్తూరు కార్పొరేషన్: దేశ ఆత్మ గ్రామాల్లో ఉందని, ఈ మేరకు గతంలో మహాత్మాగాంధీ పేర్కొన్నట్టు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్(పీఆర్), అనుబంధ విభాగాల ఉద్యోగుల పనితీరు అభినందనీయమన్నారు. ప్రజలకు పారదర్శక పాలనను ప్రజాప్రతినిధులు అందించాలన్నారు. గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక విధంగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు సేవలందిస్తున్నరని కొనియాడారు. దివంగత పీఎం, సీఎంలు రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌లతో పంచాయతీరాజ్ విభాగంలో పలు సంస్కరణలు వచ్చాయన్నారు. గత సంవత్సరం ఉత్తమ పంచాయతీగా ఐరాల మండలం, బొమ్మసముద్రం, జిల్లా పంచాయతీ అధికారిగా అవార్డులు అందుకున్నట్లు డీపీఓ సుధాకర్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ ఏడాది అవార్డు వచ్చిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అవార్డుల ప్రదానం కార్యక్రమం వాయిదా వేశారన్నారు. కేంద్ర పన్నుల సహకారంతో గ్రామాలు అభివృద్ధి జరుగుతోందన్నారు. అనంతరం డీపీఓ, డీపీఆర్సీ కార్యాలయాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో డెప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, డ్వామా పీడీ రవికుమార్, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎల్‌డీఓ రవికుమార్, పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
పాల్గొన్న పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులు


