అగ్నిగుండాలు! | - | Sakshi
Sakshi News home page

అగ్నిగుండాలు!

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

● ఉపాధి పనుల్లో సర్కారు నిర్లక్ష్యం ● మౌలిక వసతుల కల్పనలో అలక్ష్యం ● కాగితాలకే పరిమితమైన మందుల కిట్లు ● పనిముట్ల పంపిణీలోనూ అలసత్వం ● అధికారుల పర్యవేక్షణ శూన్యం ● కూలీల అవస్థలు అనేకం

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

గంజాయి స్వాధీనం
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బైరెడ్డిపల్లె మండల పోలీసులు అరెస్ట్‌ చేశారు.
ఉపాధిలో..
మండుతున్న ఎండలు... ఎండుతున్న కూలీలు

శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

పొట్టకూటి కోసం ఉపాధి హామీ కూలీలు ప్రాణాలకు తెగించి ఎండలోనే పనిచేస్తున్నారు. కానీ, వారి క్షేమం చూడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుంది. దీంతో జిల్లాలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జిల్లాలో ఉపాధి కూలీల దుస్థితి పై సాక్షి కథనం...

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. క్షేత్ర స్థాయిలో వారికి అందాల్సిన కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పనిచేసే ప్రదేశంలో నీడ, నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, మందుల కిట్లు లాంటి వాటిని అందించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కూలి డబ్బులు సైతం సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయమై ఫీల్డ్‌ అసిస్టెంట్లను అడిగితే పై నుంచి రాలేదనే పాత పాట వినిపిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కూలీలు ఎండకు ఎండుతూ.. కడుపులు మాడ్చుకుంటూ అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గతంలో వేసవి తీవ్రతను తట్టుకోవడానికి అందించిన 30 శాతం వేసవి భత్యాన్ని ప్రస్తుతం చంద్రబాబు సర్కారు అటకెక్కించింది.

నీడ.. నీళ్లు ఎక్కడ?

జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు టెంట్లు ఏర్పాటు చేయడం లేదు. వృద్ధులు, మహిళలు మండుతున్న ఎండలోనే తట్టలు మోస్తూ, గడ్డపారలతో భూమిని తవ్వుతూ చెమటతో తడిసి ముద్దవుతున్నారు. మధ్యాహ్న భోజనం చేయడానికి కనీసం చెట్టు నీడ కూడా లేదు. నెత్తిన తువ్వాళ్లు కప్పుకుని ఎండలోనే కూర్చొని అన్నం తినాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు వేడెక్కిపోయి తాగలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి మజ్జిగ జాడ లేకుండా పోయింది. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ల ఊసేలేదు.

నిబంధనలు అలంకారప్రాయం

నిబంధనల ప్రకారం ప్రతి పని ప్రదేశంలో మెడికల్‌ కిట్‌ ఉండాలి. కానీ, పొరపాటున ఎవరికై నా వడదెబ్బ తగిలినా లేదా గాయమైనా ప్రథమ చికిత్స నాథుడే లేడు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను అడిగితే పై నుంచి రాలేదు అనే పాత పాటనే పాడుతున్నారు. వేసవి భత్యం విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న జాప్యం కూలీల కడుపు కొడుతోంది. కూలీల రెక్కల కష్టాన్ని దోచుకుంటూ, వారికి కనీస గౌరవం, రక్షణ కల్పించలేని సర్కారు పై క్షేత్ర స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

జిల్లా సమాచారం

జాబ్‌కార్డులు 2.46 లక్షలు

నమోదైన కుటుంబాలు 2,46,472

నమోదైన కూలీలు 4,22,624

ఉపాధి పొందుతున్న కుటుంబాలు

1,03,386

ఉపాధి పొందుతున్న కూలీలు

1,54,316

కాగితాలకే పరిమితం

ఉపాధి పని చేసే ప్రదేశంలో నిబంధనల ప్రకారం మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు, ప్రథమ చికిత్స కిట్లు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇవి కాగితాల మీద లెక్కలకే పరిమితమయ్యాయి. ఇన్ని కష్టాల మధ్య పనిచేస్తున్న కూలీలను ఫేషియల్‌ అటెండెన్స్‌ పేరుతో సాంకేతిక వేధింపులకు పాల్పడుతున్నారు. సర్వర్లు పనిచేయక, సిగ్నల్స్‌ అందక అవస్థలు పడుతున్నారు. కష్టపడి పనిచ ఏసినా హాజరు పడకపోవడంతో కడుపులు మాడ్చుకునే పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యమవ్వడంతో, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు పాలకుల మొండి వైఖరి మధ్య ఉపాధి కూలీల బతుకులు అరణ్యరోదనగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement