శాంతిపురం: రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాంతిపురం, రామకుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నాయకుల ఇళ్లల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ భరత్‌తో పాటు గురువారం ఆయన కనుమలదొడ్డిలో మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు బుల్లెట్ దండపాణి గృహప్రవేశ పూజల్లో పాల్గొన్నారు. వారి కుటుంబాన్ని ఆశిర్వదించారు. నాయనపల్లి వద్ద ఇటీవల గృహప్రవేశమైన జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి ఇంటిని సందర్శించి వారి దంపతులను ఆశిర్వదించారు. చౌడంపల్లిలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, నడింపల్లిలో మాజీ సర్పంచ్ రమేష్, రామకుప్పం మండలం కోటచేనులో పార్టీ నాయకుడు మంజునాథరెడ్డి నివాసాలను సందర్శించారు. ఉన్సిగానిపల్లిలో ఇటీవల వివాహమైన మాజీ ఎంపీటీసీ సుబ్రమణ్యం కుమార్తె, అల్లుడిని ఆశిర్వదించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ అడ్వకేట్ అమరనాథరెడ్డిని బందార్లపల్లిలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. పర్యటనకు వచ్చిన పెద్దిరెడ్డికి నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు రాజుపేటరోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరించి వారితో ఫొటోలు దిగారు. జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డెప్ప, పీఎంకే ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, నాలుగు మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.


