కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలి | - | Sakshi
Sakshi News home page

కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలి

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

వడమాలపేట (పుత్తూరు): జనగణన ప్రాముఖ్యతను గుర్తెరిగి కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, సెన్సెస్‌–2027 స్టేట్‌ నోడల్‌ అధికారి ఎస్‌ఎస్‌ రావత్‌ పేర్కొన్నారు. గురువారం వడమాలపేట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో కలసి స్థానిక అధికారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నా రు. జనగణన కార్యక్రమ పురోగతిని పరిశీలిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం అధికారులతో కలసి రామసము ద్రం గ్రామంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ చిన్నారుల ఇంగ్లిష్‌, తెలుగు రైమ్స్‌లను ఆసక్తిగా ఆలకించారు. జనగణన డైరెక్టర్‌ కె.నివాస్‌, డీఆర్‌ఓ నరసింహులు, ఆర్డీఓ రామ్మోహన్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి వేసవి సెలవులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయన్నారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పాఠశాలలు జూన్‌ 12న పున:ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

దాడి కాదు..

నాన్నకు భయపడి అలా!

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు సమీపంలో తనపై దాడి జరిగిందంటూ బుధవారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గురువారం టూటౌన్‌ సీఐ నెట్టికంటయ్య యువకులను స్టేషన్‌కు పిలిపించారు. తన తండ్రికి భయపడి, పుట్టినరోజు వేడుకల్లో దాడి జరిగిదంటూ తప్పుడు ప్రచారం చేశామన్నారు. మరోసారి ఇలాచేస్తే కేసు పెడతామంటూ హెచ్చరించిన సీఐ, వాళ్లను పంపించేశారు.

Advertisement
 
Advertisement
Advertisement