పోలీసు ఉద్యోగం బాధ్యతతో కూడుకున్నది | - | Sakshi
Sakshi News home page

పోలీసు ఉద్యోగం బాధ్యతతో కూడుకున్నది

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

– శిక్షణ కానిస్టేబుళ్లతో ఎస్పీ తుషార్‌ డూడీ

చిత్తూరు అర్బన్‌: పోలీసు ఉద్యోగమంటే ఫ్యాషన్‌ కాదని, ఇది బాధ్యతతో కూడుకున్నదని చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడీ స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికై .. శిక్షణ పొందుతున్న అభ్యర్థులను కలిశారు. తొసి సెమిస్టర్‌ పరీక్షల ముగింపు నేపథ్యంలో అభ్యర్థులతో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడానికి పోలీసు ఉద్యోగం బాధ్యతతో చేయాలన్నారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న అంశాలు, నైపుణ్యాలను భవిష్యత్తులో ఉపయోగపడుతాయన్నారు. ప్రతీ అభ్యర్థి నైతిక విలువలు, ప్రజల పట్ల సానుభూతి, వృత్తిలో నిజాయితీ పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాంబాబు, పర్యవేక్షకులు డా.షానుషైక్‌, ఇన్‌స్పెక్టర్‌ శరత్‌చంద్ర, వీరేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement