దశదిశ మార్చే కోర్సులు | - | Sakshi
Sakshi News home page

దశదిశ మార్చే కోర్సులు

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

● ఒకేషనల్‌ కోర్సులతో వెంటనే ఉద్యోగ అవకాశాలు ● పదోతరగతి పూర్తికాగానే ఇంటర్‌లో వృత్తి విద్యాకోర్సులు ● పది ఒకేషనల్‌ కోర్సులున్న కళాశాల పలమనేరు మాత్రమే ● ఉమ్మడి జిల్లాలో టెన్త్‌ పూర్తయిన వారికి ఇదో సువర్ణ అవకాశం

ఎంఅండ్‌ఏటీ( మెకానికల్‌ అండ్‌ ఆటోమొబైల్‌ టెక్నీషియన్‌): ఈకోర్సును పూర్తిచేస్తే స్థానికంగా ఉండే ఆటోమొబైల్స్‌ కంపెనీల్లో చేరవచ్చు. లేదా సొంతంగా మెకానిక్‌షాపును పెట్టుకోవచ్చు.

ఈటీ(ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌): దీన్ని పూర్తి చేస్తే కంపెనీల్లో ఎలక్ట్రీషియన్‌గా చేరవచ్చు. లేదా ప్రైవేటుగా ప్రాక్టీసు చేసుకోవచ్చు.

సీఈటీ( సివిల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌): ఇది భవన నిర్మాణాలకు సంబంధించిన కోర్సు. దీన్ని పూర్తిచేస్తే నిర్మాణ రంగంతోబాటు సొంతంగా ఉపాధి లభిస్తుంది.

ఎంఎల్‌టీ(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌): ఈ కోర్సును పూర్తిచేసి ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాలను పొందవచ్చు.

ఎంపీహెచ్‌డబ్యూ(ఉమెన్‌): (మల్టిపర్ఫస్‌ హెల్త్‌ వర్కర్‌): ఈ కోర్సు పూర్తిచేస్తే వైద్యరంగంలో ఉద్యోగాలతోబాటు ప్రైవేటు వైద్యరగంలో విస్తృత అవకాశాలున్నాయి.

ఎల్‌ఎం అండ్‌ డీ(లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మనెంట్‌ అండ్‌ డైయిరింగ్‌): ప్రస్తుతం ఎక్కువ డిమాండ్‌ ఉన్న కోర్సు ఇది. దీన్ని పూర్తి చేస్తే స్థానికంగా ఉన్న మిల్క్‌ డెయిరీల్లో ఉపాధి సౌకర్యాలున్నాయి.

సీఎస్‌ఈ(కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌): ఇందులో ఉపాధి చాలా అవకాశాలున్నాయి.

బీఅండ్‌ఆర్‌ఎం(బ్యాంకింగ్‌ అండ్‌ రీటైల్‌ మేనేజ్‌మెంట్‌): బ్యాంకు ఉద్యోగాలతో పాటు ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్‌, చిట్‌ఫండ్స్‌లలో అవకాశాలున్నాయి.

సిరికల్చర్‌: ఈ కోర్సుతో ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు సొంతంగా పట్టుపురుగులను సంరక్షణ చేపట్టవచ్చు.

పది రకాల ఉపాధులకు ఇదే తొలిమెట్టు!

సాధరణంగా ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, హెచ్‌ఈసీలు మాత్రమే చాలామందికి తెలు సు. కానీ వృత్తి విద్యా కోర్సుల ద్వారా వెంటనే ఉపాధి పొందే పది రకాల కొర్సులున్నాయనే విషయం చాలామందికి తెలియదు. ఈ క్రమంలో సంప్రదాయ కోర్సుల్లోనే పిల్లలను చేర్పిస్తుంటారు.

మంచి సౌకర్యాలు

పలమనేరులోని ప్రభుత్వ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులు, మ ధ్యాహ్న భోజనం, ఎస్సీ, బీసీ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్‌ సౌకర్యం, ఆన్‌లైన్‌ తరగతు లు, ఐఎఫ్‌బీ ఫ్యానెల్స్‌ ద్వా రా బోధన, సువిశాలమైన ఆటస్థలం, స్టడీ అవర్‌, ఉచితంగా పుస్తకాలు ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

డెయిరీ టెక్నాలజీతో

ఉపాధి అవకాశాలు మెండు

రెండేళ్ల డెయిరీ టెక్నాలజీ పూర్తిచేసేలోపే మిల్క్‌ డెయిరీల్లో ఉద్యోగాలు వస్తాయి. లేదా బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీఎస్సీ డెయిరీ సైన్స్‌ ఆపై ఎంటెక్‌లు చేసుకోవచ్చు.

త్వరగా ఉపాధిని

పొందాలని..

ఉన్నత చదువులకు మాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. అందుకే ఎంఎల్‌టీలో చేరా. ప్రభుత్వ ఉద్యోగంతో పని లేకుండా ల్యాబ్‌లలో పని చేసుకోవచ్చు. లేదా నేనే సొంతంగా ల్యాబ్‌ పెట్టుకోవచ్చు.

– పూర్ణచంద్రరావు, ఎంఎల్‌టీ ఫస్ట్‌ఇయర్‌ స్టూడెంట్‌, పలమనేరు

ఉపాధికి ఇది దగ్గర దారి

టెన్త్‌ కాగానే ఇక్కడి వొకేషనల్‌ కోర్సులో చేరితే స్వయం ఉపాధితోపాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదివిన వారిలో సగానికిపైగా విద్యార్థులు వారి రంగాల్లో స్థిరపడ్డారు. పలు కంపెనీల జాబ్‌ టైఅప్‌లున్నాయి. ఇప్పటికే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్నవాళ్లు నేరుగా కళాశాలలో సంప్రదించాలి. – కన్నయ్య, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పలమనేరు

ఇప్పుడంతా విద్య వ్యాపారంగా మారింది. చదువును కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు, ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్లు కావాలంటే కార్పొరేట్‌ కాలేజీలకు లక్షలకు లక్షలు ధారబోయాల్సి వస్తోంది. అయితే పదో తరగతి తర్వాత ప్రభుత్వ కళాశాలల్లోనే రెండేళ్ల వ్యవధిలో ఉపాధి అవకాశాలున్న ఒకేషనల్‌ కోర్సులు పదికిపైగా ఉన్నాయి. వీటి ప్రాధాన్యత తెలియని విద్యార్థులు ఇతర కోర్సుల్లో చేరుతున్నారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉచితంగా చేరి ఈ రెండేళ్ల కోర్సులను పూర్తి చేస్తే వెంటనే ఉపాధి, ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 52 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలుండగా పది ఒకేషనల్‌ కోర్సులున్నది పలమనేరులో మాత్రమే.

– పలమనేరు

ఉపాధికి మార్గాలిలా..

వొకేషనల్‌ కోర్సులు మేలు

Advertisement
 
Advertisement
Advertisement