కురిసే పూలవాన.. రామయ్య మురిసెలోలోన.. | - | Sakshi
Sakshi News home page

కురిసే పూలవాన.. రామయ్య మురిసెలోలోన..

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

తిరుపతి కల్చరల్‌: శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామి వారి పుష్పయాగం కనుల పండుగగా సాగింది. ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు సీతాలక్ష్మణ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛ రణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి పుష్పయాగం వైభవంగా జరిపారు. తులసి, రోజా, తామర, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, కలువ తదితర 12 రకాల పుష్పాలు, ఆరు రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేశారు. రాత్రి 7 గంటలకు సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కుప్పంరూరల్‌: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కుప్పం మండలం, దాసేగౌనూరు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివకుమార్‌ (45) దాసేగౌనూరు పంచాయతీ, రామ్‌నగర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏమి జరిగిందో తెలియదుకానీ శివకుమార్‌ గురువారం అర్చనా గ్రానైట్‌ ఫ్యాక్టరీ సమీపంలోని మామిడి తోట లో శవమై కనిపించాడు. శివకుమార్‌ మృతి చెందిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చా రు. కుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని శివకుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివకుమార్‌ను ఎవరో హత్య చేసి ఉంటారని, అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని స్థానికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

చిత్తూరు కార్పొరేషన్‌: స్థానిక సిద్ధంపల్లె రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియన మహిళ మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. దాదాపు వయస్సు 60– 65 సంవత్సరాలు మధ్య ఉన్న వృద్ధురాలు సిద్ధంపల్లె మీదుగా చిత్తూరు రైల్వేస్టేషన్‌కు వస్తున్న కాట్పాడి– తిరుపతి రైలును గమనించకుండా ట్రాక్‌ దాటుతోంది. ఆ సమయంలో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు తెలుపు చుక్కలతో కూడిని నల్లపు రంగు జాకెట్‌, ఎర్ర రంగు చీర ధరించి ఉంది. కుడి ఛాతికిపై, కింద భాగంలో నల్లటి పుట్టుమచ్చ లున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా న్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement