గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

గంజాయి స్వాధీనం

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

పలమనేరు: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.24 వేల విలువజేసే 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గంగవరం సీఐ పరశురాముడు బైరెడ్డిపల్లి స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు బైరెడ్డిపల్లి–నాలుగురోడ్లు రహదారిలో సబ్‌స్టేషన్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నల్లటి సంచుల్లోని గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు బండ ఇండ్లుకు చెందిన బాబు(60), లక్కనపల్లికి చెందిన రఫీ (54)గా తెలిసింది. వీరికి పుంగనూరుకు చెందిన ఆనంద్‌ నుంచి సరుకు వస్తోందని, దీన్ని స్థానికంగా ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు తెలిపారు. ఇతన్ని కూడా త్వరలో అరెస్ట్‌ చేస్తామని సీఐ తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో అక్కడి తహసీల్దార్‌ ప్రసన్నకుమార్‌, ఎస్‌ఐ చందనప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement