రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

పుత్తూరు: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన దుర్ఘటన గురువారం తెల్లవారు జామున పుత్తూరు బైపాస్‌ రోడ్డులో చోటు చేసుకొంది. ఎస్‌ ఐ వెంకటలక్ష్మి కథనం మేరకు వివరాలు.. స్థానిక సాయినగర్‌కు చెందిన ప్రముఖ న్యాయ వాది ఎం.సంజీవి కుమారుడు ఎం.ధర్మతేజ (22) తన మిత్రులతో కలసి మారుతీ సుజికీ కారులో తిరుపతికి వెళుతుండగా స్థానిక బైపాస్‌ రోడ్డులోని పిళ్లారిపట్టు క్రాస్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న ధర్మతేజ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న స్నేహితులు పూర్ణచంద్ర, పవన్‌సాయి, చరణ్‌తేజలకు తీవ్ర గాయా లు కాగా పుత్తూరు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. మృతుని తల్లి కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాలిసెట్‌ రేపు

తిరుపతి సిటీ: పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలీసెట్‌– 2026 శనివారం జరగనున్నట్లు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వై ద్వారకనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో రేణిగుంట, వెంకటగిరి, సత్యవేడులో ఒక్కొటి చొప్పున, నాయుడు పేట లో రెండు, శ్రీకాళహిస్తిలో రెండు, పుత్తూరులో రెండు, తిరుపతిలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 17 సెంటర్లలో 5,143 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్ష కేంద్రాలకు గంట ముందే విద్యార్థులు హాజరుకావాలని సూచించారు. మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అను మతి లేదని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement