చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనం నడిపేవాళ్లు హెల్మెట్లు పెట్టుకోవడాన్ని ప్రోత్సాహించడానికి చిత్తూరు పోలీసు శాఖ చేపట్టిన హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు లక్కీడిప్‌ను బుధవారం నిర్వహించారు. స్థానిక పోలీసు అతిథిగృహంలో ఎస్పీ తుషార్ డూడీ లక్కీడిప్ ద్వారా విజేతల పేర్లు ప్రకటించారు. ట్రాఫిక్ సీఐ నిత్యబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో హెల్మెట్టు పెట్టుకున్న వాళ్లు ఓ చీటీ రాసి బాక్సులో వేయడం.. లక్కీడిప్ ద్వారా విజేతలకు నగదు బహుమతులను అందచేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో విడత లక్కీడిప్‌లో విజేతల పేర్ల ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
25 నుంచి
వేసవి శిక్షణ శిబిరం
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనా త్మకతను వెలికితీసేందుకు ఈ నెల 25 నుంచి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించనున్నట్లు జిల్లా బాలభవన్ ఇంచార్జ్, డీవైఈవో ఇందిర తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో శిబిరం ఉంటుందన్నారు. శిబిరంలో చిత్రలేఖనం, కలరింగ్, పేపర్ కటింగ్, థర్మాకోల్ కట్టింగ్, డిజైన్ వర్క్, ఇతర సృజనాత్మకత కళలు నేర్పించనున్నట్టు తెలిపారు. రోజూ ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆరు ఏళ్ల నుంచి 16 సంవత్సరాల లోపు వయ స్సు ఉన్న విద్యార్థులు అర్హులన్నారు. శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఈవో కోరారు.
లక్కీడిప్ తీస్తున్న ఎస్పీ డూడీ


