నేడు కరెంటోళ్ల జనబాట | - | Sakshi
Sakshi News home page

నేడు కరెంటోళ్ల జనబాట

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు.

పులి కోసం గాలింపు

చిత్తూరు కార్పొరేషన్‌: నగరంలోని దొడ్డిపల్లె హౌసింగ్‌ కాలనీలో పులి సంచరిస్తున్నట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎఫ్‌ఆర్వో థామ స్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతమంతా గాలించారు. ఆనవాళ్ల కోసం డ్రోన్‌ కెమెరాతో పరిశీలించారు. పులి తిరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. ఇదిలావుండగా జనారణ్యంలో గాయపడిన రెండేళ్ల చిరుత ఆదివారం చనిపోయిన విషయం తెల్సిందే.

పోలీసు గ్రీవెన్స్‌కు 46 ఫిర్యాదులు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 46 అర్జీలు వచ్చినట్టు ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. ఈ మేరకు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగా దాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

మా కేంటి సంబంధం!

కుప్పం: తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని కుప్పం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లలితమురేగష్‌ పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శాంతిపురం మండలం, నంజంపేట గ్రామంలో జరిగిన దీపోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారని చెప్పారు. ఆ సందర్భంగా గోడవలు జరిగాయని, అవి పార్టీల రంగులద్దుకుని సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేసే స్థాయికి వెళ్లాయన్నారు. కబడ్డీ పోటీల్లో మునెప్ప కుమారుడు కిరణ్‌రాజేష్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు ప్రవీణ్‌కు గొడవలు జరిగాయని తెలిపారు. ఆపై రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణపడ్డారని తెలిపారు. ఈ గొడవల్లో ఎలాంటి సంబంధం లేని తన భర్త మురుగేష్‌పై కేసులు పెట్టారని వెల్లడించారు. రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లి గ్రామంలో ఉన్న తమకు నంజంపేట గ్రామంలోని గోడవలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. తన భర్త తప్పు చేయలేదని తెలిపారు. ఆమె వెంట దళిత సంఘ నాయకులు మెహన్‌నాయక్‌, భాస్కర్‌నాయక్‌, చెంగప్ప తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement