చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ సేవలను ప్రజలు సంతృప్తి చెందేలా అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. యాదమరి, శాంతిపురం, జీడీనెల్లూరు, గుడుపల్లె మండలాల నుంచి అధిక సమస్యలు వస్తున్నాయన్నారు. పెండింగ్ అర్జీలను పరిష్కరించాలని చెప్పారు. ఆర్టీసీ బస్టాండుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మోహన్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.
వినతుల పరిష్కారంపై చర్యలు
సీఎం కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో వచ్చి న వినతుల పరిష్కారంపై చర్యలు చేపట్టినట్లు కలె క్టర్ తెలిపారు. వి.కోట మండలం, కృష్ణ్ణాపురంలో దారి సమస్య, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో రైతు వెబ్‌ల్యాండ్ రికార్డు సమస్య, పులి చెర్ల మండలంలో ఓ వ్యక్తికి సీఎం సహాయ నిధి మంజూరు, రామకుప్పం మండలం నారాయణపురంలో రైతుకు పట్టాదారు పుస్తకం జారీ తదితర సమస్యపై తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.


