పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన ఉపాధి కూలీ సత్య సోమవారం పని చేస్తూ ఎండకు తట్టుకోలేక కళ్లు తిరిగి పక్కనున్న బండపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. ఉద యం 10 గంటలకు సత్య ఉపాధి పనికని గుట్టలో కందకాలు తీస్తున్నాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక కళ్లు తిరిగి బండపై పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే పాలసముద్రం పీహెచ్‌సీకి తరలించారు. తలకు పది కుట్లు పడినట్టు డాక్టర్ మోహన్‌కృష్ణ తెలిపారు. పరిస్థి తి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ సతీష్‌కుమార్, ఏపీఓ మార్గేట్ పీహెచ్‌సీకి వచ్చి సత్యను పరిశీలించారు.
అందుబాటులో లేని 108
సత్య పరిస్థితి విషమంగా ఉండడంతో అధికారులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే స్థానిక పీహెచ్‌లో ఉండాల్సిన 108 అందుబాటులో లేకపోవడంతో ఒకటిన్నర గంటకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులు గా 108 వాహనం జీడీనెల్లూరులోనే ఆపి ఉంచినట్టు సమాచారం. ఆపై సత్యను చిత్తూరుకు తరలించారు.


