– ఒకేసారి రెండు కేంద్రీయ
విద్యాలయాలు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రారంభించిన కేంద్రీయ విద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాల తో విద్యను అందించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇరువారం వద్ద కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఒకే సారి ఏర్పాటు కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఒకేసారి చిత్తూరు, కుప్పంలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కో విద్యాలయంలో 320 సీట్ల సామర్థ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనున్నట్టు తెలిపా రు. తాత్కాలిక భవనాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ మేయర్ అముద, ప్రిన్సిపల్ లూథర్, డీఈవో రాజేంద్రప్రసాద్, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ పాల్గొన్నారు.
ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, అనంతాపురం పంచాయతీ శెట్టిన్‌తంగాల్ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై టీడీపీలోని ఓ వర్గం నేతలు సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయమైన సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసి తమిళనాడుకు తరలిస్తున్నారని ఆ వర్గ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై నిఘా వర్గాలు విచారణలో పడ్డాయి.


